సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి మాతృవియోగం

  • నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూత
  • ఆమె వయసు 93 సంవత్సరాలు
  • కాకినాడ జిల్లా మల్లంపేటలో తుదిశ్వాస విడిచిన చిట్టెమ్మ
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె మృతి చెందారు. రెడ్డి చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు ఆర్.నారాయణమూర్తి. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

R Narayana Murthy
Mother
Dead
Tollywood

More Telugu News